డిసెంబరు 12లోగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దీనిలో సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 06 ఉన్నాయి. అభ్యర్థులు ఎంఎస్సీ (మెడికల్ మైక్రోబయాలజీ/అప్లయిడ్ మైక్రోబయాలజీ/ జనరల్ మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ) (లేదా) బీఎస్సీ(మెడికల్ మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ/లైఫ్ సైన్సెస్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల యొక్క మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. అభ్యర్థులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://cfw.ap.nic.in/ వెబ్ సైట్ సందర్శించండి. (ప్రతీకాత్మక చిత్రం)