ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లు ప్రారంభించే తేదీని వాయిదా వేసింది విద్యాశాఖ. రాష్ట్రంలో మే 6 నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అయితే.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు జులై 4న తిరిగి ప్రారంభించాల్సి ఉంది. అయితే.. స్కూళ్లను జులై 4కు బదులుగా.. 5న ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
విద్యార్థులు ఈ నెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి దశ అడ్మిషన్లు ఈనెల 27 నుంచి ప్రారంభిస్తారు. వచ్చే నెల 20 వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి. గడువు తేదీ కూడా అదే. జూలై 1 నుంచి కళాశాలలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు ఒక ప్రకటన విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్, రెసిడెన్షియల్, బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ కళాశాలలు, ఒకేషనల్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు ఈ తేదీలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇంటర్ ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీ్‌సమెన్, ఈబీసీలకు వారి కోటా రిజర్వేషన్లు వర్తింపజేస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
బాలికలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. పదో తరగతి మార్కులు, గ్రేడ్ల ఆధారంగానే ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో సెక్షన్‌కు 88కి మించి అడ్మిషన్లు చేసుకోకూడదు. ఒకేషనల్‌లో అయితే ఒక్కో సెక్షన్‌కు 30, నాన్ పారామెడికల్ కోర్సుల్లో ఒక్కో సెక్షన్లో 40మందిని మాత్రమే చేర్చుకోవాలని నిబంధనలు రూపొందించారు.(ప్రతీకాత్మక చిత్రం)