కరోనా (Corona) ప్రారంభం నుంచి వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను ఆయా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా విభాగాల్లో వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు డీఎంహెచ్ఓ కార్యాలయం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివిధ విభాగాల్లో మొత్తం 18 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. Specialist MO-Pediatrician: ఈ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. ఎంబీబీఎస్ తో పాటు పీజీ/పీడియాట్రిక్ లో డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ఎంపికైన వారికి నెలకు రూ.1.40 లక్షల నుంచి రూ.1.10 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
Specialist MO-Obstetrics and Gynecology: ఈ విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి. ఎంబీబీఎస్ తో పాటు పీజీ/OBGలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
OT Technician: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ చేసి ఉండాలి. ఇంకా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్సులో డిప్లొమా చేసి ఉండాలి. లేదా అనస్తేషియా టెక్నీషియన్ కోర్సులను ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల వేతనం చెల్లించనున్నారు.
Clinical Psychologist: ఈ విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి. ఎంఏ(Psychology) మరియు మెడికల్ & సోషల్ సైకాలజీలో డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.33,075 వేతనం చెల్లించనున్నారు. Optometrist: ఈ విభాగంలో 1 ఖాళీ ఉంది. Optometry లో బ్యాచలర్స్ లేదా మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీకి అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.23,310 వేతనం చెల్లించనున్నారు.
Dental Technician: ఈ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. డెంటల్ టెక్నీషన్ కోర్సు పాసై ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల వేతనం చెల్లించనున్నారు. వయో పరిమితి: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 42 ఏళ్లు ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, PH అభ్యర్థులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.