ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ - APSSDC నుంచి ప్రముఖ Reliance సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC నిరుద్యోగులకు చక్కని ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ప్రముఖ సంస్థలకు, నిరుద్యోగులకు వారధిగా ఉంటూ ఉద్యోగాలను కల్పిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
రిలయన్స్, పేటీఎం, ఫ్లిప్ కార్ట్ తదితర ప్రముఖ సంస్థల్లోని ఖాళీలను సైతం స్థానిక యువతతో భర్తీ చేసేందుకు కృషి చేస్తోంది. తాజాగా ప్రముఖ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ (Reliance Smart Point) లో ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
ఖాళీలు, విద్యార్హతల వివరాలు.. మొత్తం 75 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
పార్ట్ టైం/ఫుల్ టైం కేటగిరీల్లో ఈ నియామకాలు చేపట్టారు. పార్ట్ టైం కింద ఎంపికైన వారికి నెలకు రూ. 4,500, ఫుల్ టైం విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ. 9,500 చెల్లించనున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కూడా ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా ముందుగా ఈ నెల 24లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 25న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు Reliance Smart Point, Captain Ramarao jn, Near to dolphin hotel main gate, vizag చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి 15 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. అనంతరం గాజువాక, నాయిడు తోట, గోపాల పట్నం, మధురవాడ తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇతర పూర్తి వివరాలకు 9010023033 నంబరును సంప్రదించాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)