ఏపీలోని సీఎం జగన్ ప్రభుత్వం అత్యంతంగా ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది సర్కార్.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
తాజాగా కడప జిల్లాలో భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 913 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
టెన్త్, ఇంటర్ పాసైన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అప్లై చేయొచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్థానిక వార్డు, గ్రామ పరిధిలో నివసిస్తున్న అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అప్లై చేయాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో ఆయా ఉద్యోగాలకు అప్లై చేయాలని సూచించారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఉంటారు. సేవా సంస్థల్లో పని చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
అధికారిక వెబ్ సైట్: https://gswsvolunteer.apcfss.in/