1. ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. విశాఖపట్నంలోని ఈఎన్టీ ఆస్పత్రిలో ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. మొత్తం 12 ఖాళీలున్నాయి. ఆడియో టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, రేడియోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టులున్నాయి. ఇవి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ గడువు ఒక ఏడాది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 15 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే అభ్యర్థులు పోస్టులో దరఖాస్తు ఫామ్స్ పంపాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 12 ఖాళీలు ఉండగా అందులో ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు 02 ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. ఆడియో టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్పీచ్ థెరపీ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు 2 ఉన్నాయి. బీఎస్సీ, డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ పాస్ అయినవారు అప్లై చేయాలి. రేడియోగ్రాఫర్ పోస్టులు 2 ఉన్నాయి. సీఆర్ఏ, డీఎంఐటీ, డీఆర్జీఏ ఎగ్జామినేషన్ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి. డార్క్ రూమ్ అసిస్టెంట్ సర్టిఫికెట్ ఉన్నవారు అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు 1 ఉంది. పీజీడీసీఏ సర్టిఫికెట్ ఉన్నవారు అప్లై చేయాలి. స్ట్రెచర్ బేరర్ లేదా స్ట్రెచర్ బాయ్ పోస్టు 1 ఉంది. ఎస్ఎస్సీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉన్నవారు దరఖాస్తు చేయాలి. అభ్యర్థుల వయస్సు 2021 డిసెంబర్ 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. దరఖాస్తు విధానం చూస్తే అభ్యర్థులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ https://visakhapatnam.ap.gov.in/ లో డౌన్లోడ్ చేయాలి. 2021 డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ 2021 డిసెంబర్ 30న విడుదలవుతుంది. తుది మెరిట్ లిస్ట్ 2022 జనవరి 5న విడుదలవుతుంది. సెలెక్షన్ ఆర్డర్స్ 2022 జనవరి 10న విడుదలవుతాయి. 2022 జనవరి 17 విధుల్లో చేరాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత Hospital Development Society, Govt. ENT Hospital, Visakhapatnam పేరుతో రూ.200 డీడీ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్‌కు టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్, క్వాలిఫికేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ జత చేయాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: Superintendent, Govt. ENT Hospital, Peddawaltair, Visakhapatnam-530017. (ప్రతీకాత్మక చిత్రం)