ANDHRA PRADESH HIGH COURT RECRUITMENT 2021 APPLICATION PROCESS ENDS TOMORROW FOR 25 POSTS SS
High Court Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని హైకోర్టులో ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
Andhra Pradesh High Court Recruitment 2021 | నిరుద్యోగులకు అలర్ట్. ఆంధ్రప్రదేశ్‌లోని హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మరో రోజు మాత్రమే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
1. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. కోర్టులో జడ్జీలు, రిజిస్ట్రార్లకు సహాయకులుగా పనిచేసే కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రెటరీ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 21 చివరి తేదీ. అంటే అప్లై చేయడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. విద్యార్హతల వివరాలు చూస్తే ఆర్ట్స్, సైన్స్, కామర్స్ సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికెట్ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.350 ఫీజు చెల్లించాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. మెరిట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఎంపికైన వారికి నెలకు రూ.37,100 వేతనం లభిస్తుంది. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలను https://hc.ap.nic.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. అభ్యర్థులు https://hc.ap.nic.in/ వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Registrar (Administration), High Court of Andhra Pradesh, Nelapadu, Amaravati, Guntur District, Pin-522237. (ప్రతీకాత్మక చిత్రం)