1. ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ జరగబోతోంది. ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్లు వచ్చాయి. మొత్తం 5,905 ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. కలెక్టర్ల అధ్యక్షతలో వేసిన కమిటీలు ఉద్యోగులను ఎంపిక చేయనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. దరఖాస్తుల్ని స్వీకరించిన తర్వాత ఇంటర్వ్యూలు ఉంటుంది. మొత్తం 5,905 పోస్టుల్లో అంగన్వాడీ హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు, మెయిన్ అంగన్వాడీ వర్కర్ పోస్టులున్నాయి. గతంలోనే కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీ పూర్తైంది. ఇప్పుడు మిగిలిన జిల్లాల్లో 5,905 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)