దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ లో ప్రతి రోజూ లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు కాలేజీలను మూసివేశారు.
2/ 10
ఇప్పటికే తెలంగాణలో విద్యాసంస్థలను మూసివేసి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఐతే పరీక్షల నిర్వహణపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
3/ 10
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా టెన్త్, ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. కరోనా వ్యాప్తిని బట్టి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 10
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతి రోజూ గత వారం రోజులుగా 2500 నుంచి 4వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలతో పాటు పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన వెలువుడుతుందన్న ప్రచారం జరిగింది.
5/ 10
కేంద్రం సీబీఎస్ఈసీ పరీక్షలను కూడా రద్దు చేయడంతో ఏపీ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తుందన్న చర్చ కూడా సాగింది. ఐతే ఈ చర్చకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెరదించారు. పరీక్షల రద్దు/వాయిదాపై కీలక ప్రకటన చేశారు.
6/ 10
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని.. ఎట్టిపరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరిగితే అప్పుడు ఆలోచిస్తామని వెల్లడించారు.
7/ 10
విద్యాసంస్థల్లో కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని.. అలా పాటించని స్కూళ్లు, కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయి చర్చిస్తామన్నారు.
8/ 10
కాగా గతంలో ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సెస్సీ పరీక్షల షెడ్యూల్ ప్రకారం: జూన్ 7-ఫస్ట్ లాగ్వేజ్, జూన్ 8-సెకండ్ లాంగ్వేజ్, జూన్ 9-థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లిష్), జూన్ 10-మాథ్స్, జూన్ 11-భౌతిక శాస్త్రం, జూన్ 12-జీవ శాస్త్రం, జూన్ 14-సోషల్ (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
గతేడాది వరకు ఉన్న 11 పరీక్షలను ఈ ఏడాది 7కే కుదించారు. రెండు ప్రశ్న పత్రాలు ఉండే తెలుగు, ఇంగ్లిష్, మాథ్స్, సోషల్ సబ్జెక్టులకు ఈ సారి ఒకటే పేపర్ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
ఇక ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ పరిశీలిస్తే.. మే 5వ తేదీ నుంచి 22 వరకు ఫస్ట్ ఇయర్, మే 5వ తేదీ నుంచి 23 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు.