ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల (Jobs) భర్తీకి ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు ముందుగా కృష్ణా జిల్లా అధికారిక వెబ్ సైట్ (https://krishna.ap.gov.in/) ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం Notices విభాగంలో Recruitment ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
అనంతరం Application లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)