1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేస్తూనే ఉంది. రెండు నోటిఫికేషన్ల ద్వారా 2,213 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఓ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ లాంటి పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జిల్లాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 1,317 పోస్టుల్ని భర్తీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, సానిటరీ అటెండర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 5 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి వివరాలు తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 1317 ఖాళీల్లో ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు 839 ఉన్నాయి. 10వ తరగతితో పాటు ఫస్ట్ ఎయిడ్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ ఉన్నవారు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైనవారికి రూ.12,000 వేతనం లభిస్తుంది. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్టులు 312 ఉన్నాయి. 10వ తరగతి పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైనవారికి రూ.12,000 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు 17 ఉన్నాయి. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పాస్ కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయినవారు దరఖాస్తు చేయాలి. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. రూ.28,000 వేతనం లభిస్తుంది. ఇక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు 124 ఉన్నాయి. 10వ తరగతితో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా పాస్ కావాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. రూ.28,000 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. దరఖాస్తు విధానం చూస్తే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. అభ్యర్థులు సంబంధిత జిల్లా అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. మరో నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 896 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వైద్య విధాన పరిశద్ ఆస్పత్రుల్లో రెగ్యులర్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ప్రభుత్వం మరిన్ని ఖాళీలను భర్తీ చేసే అలోచనలో ఉంది కాబట్టి నియామక ప్రక్రియ ముగిసే నాటికి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ప్యాథాలజీ, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రి, డెర్మటాలజీ, ఈఎన్టీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటల్లోగా అప్లై చేయాలి. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఈ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
8. మొత్తం 896 ఖాళీలు ఉండగా అందులో గైనకాలజీ- 302, పీడియాట్రిక్స్- 120, అనస్తీషియా- 118, జనరల్ మెడిసిన్- 61, జనరల్ సర్జరీ- 53, ఆర్థోపెడిక్స్- 29, ప్యాథాలజీ- 19, ఆప్తమాలజీ- 29, రేడియాలజీ- 21, సైకియాట్రి- 8, డెర్మటాలజీ- 13, ఈఎన్టీ- 21, సీఎఎస్ జనరల్- 86, డీఏఎస్- 16 పోస్టులున్నాయి. ఎంపికైన వారికి రూ.53,500 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. విద్యార్హతల వివరాలు చూస్తే సీఏఎస్ జనరల్ పోస్టులకు ఎంబీబీఎస్ పాస్ కావాలి. సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్బీ పాస్ కావాలి. డీఏఎస్ పోస్టులకు బీడీఎస్ పాస్ కావాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్, ఏపీ డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు https://dmeaponline.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. For New Applicant Register Here పైన క్లిక్ చేయాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్, నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేస్తే నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మొదటి స్టెప్‌లో వ్యక్తిగత వివరాలు, రెండో స్టెప్‌లో స్కూల్ వివరాలు ఎంటర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
11. మూడో స్టెప్‌లో మెడికల్ ఎడ్యుకేషన్ వివరాలు, నాలుగో స్టెప్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఐదో స్టెప్‌లో టెన్త్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీన్‌బీ సర్టిఫికెట్స్, మార్క్స్ మెమో, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. చివరగా వివరాలన్నీ సరిచూసుకొని ఫీజు చెల్లించాలి. దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసి భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)