ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాస్ పర్సంటేజ్ తక్కువగా నమోదు కావడం, అనేక మంది విద్యార్థులకు తక్కువగా మార్కులు రావడంతో ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
టెన్త్ విద్యార్థులకు బెటర్మెంట్ కు అవకాశం కల్పించింది. 50 మార్కుల కంటే తక్కువ వచ్చినా 2 సబ్జెక్టుల పరీక్షలను విద్యార్థులు మళ్లీ రాసే అవకాశం కల్పించింది జగన్ సర్కార్.
సప్లిమెంటరీ పరీక్షలతో పాటు విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ ను రాసుకోవచ్చు. అయితే.. ఒక్కో సబ్జెక్టుకు రూ.500లను ఫీజుగా చెల్లించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫీజు చెల్లించడానికి ఈ నెల 19ని లాస్ట్ డేట్ గా నిర్ణయించారు అధికారులు. విద్యార్థులు ఆ తేదీలోగా ఫీజు చెల్లించాల్సి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో అతి తక్కువ పాస్ పర్సంటేజ్ నమోదు కావడంతో.. తీవ్ర రాజకీయ దుమారమే రేగింది. రాష్ట్రం మొత్తం మీద 6.22 లక్షల మంది రాసిన పరీక్షల్లో కేవలం 67.27 శాతం మాత్రమే పాస్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002 పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 66.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆ తర్వాత ఇప్పుడే ఇంత తక్కువ ఉత్తీర్ణత రావడం. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో ఈ నెల 24న ఇంటర్ పరీక్షలు ముగిసన విషయం తెలిసిందే. అయితే.. ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే మరో వైపు ఈ నెల 12న వాల్యుయేషన్ ను సైతం ప్రారంభించింది ఇంటర్ బోర్డ్. గతంలో ఇంటర్ ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడం, విద్యార్థులు ఆందోళనలకు దిగిన నేపథ్యంలో అలాంటి ఘటనలకు ఆస్కారమే ఇవ్వకూడదన్న లక్ష్యంతో ఇంటర్ బోర్డ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. (ప్రతీకాత్మక చిత్రం)
అమ్మ ఒడి (Ammavodi Scheme), నాడు-నేడు పథకాలతో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుండగా.. ఇప్పుడొచ్చిన ఫలితాలు పూర్తి నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి జూలైలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనికోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ నెల 13 నుంచి ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిణకు రూపకల్పన చేశారు. ఏఏ పాఠశాలలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు.. ఏ సబ్జెక్టుల్లో పాస్ మార్కులు రాలేదో తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సంప్లిమెంటరీ కాకుండా.. రెగ్యులర్ పాస్‌గానే ఈసారి ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కసరత్తులు మొదలుపెట్టారు. (ప్రతీకాత్మక చిత్రం)