ANDHRA PRADESH EDUCATION MINISTER ADIMULAPU SURESH MADE KEY COMMENTS ON SSC AND INTERMEDIATE EXAMS IN THE STATE FULL DETAILS HERE PRN
AP SSC, Inter Exams: టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.., మంత్రి ఏమన్నారంటే..
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదోతరగతి (SSC), ఇంటర్ పరీక్షలు (Intermediate Exams) రద్దు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
2/ 7
హైకోర్టు సూచనలతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసింది. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో చెప్తామని ప్రకటించింది.
3/ 7
ఐతే పరీక్షల రద్దు అంశంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు.
4/ 7
టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.
5/ 7
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముందుగానే షెడ్యూల్ ప్రకటించి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
6/ 7
ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చామన్న మంత్రి.. వారి భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పలు రాష్ట్రాలు ఇప్పుటికే పరీక్షలు నిర్వహించాయన్నారు.
7/ 7
జూన్ 1 నుంచి టీచర్లు విధులకు హాజరుకావాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. త్వరలో పరీక్ష షెడ్యూల్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.