AP Tenth, Inter Exams: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై మంత్రి సురేష్ కీలక ప్రకటన.. పూర్తి వివరాలివే
AP Tenth, Inter Exams: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై మంత్రి సురేష్ కీలక ప్రకటన.. పూర్తి వివరాలివే
ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ వాయిదా పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు అంశంపై ఆయన కీలక వాఖ్యలు చేశారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జూన్ 7 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.( ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ - ఫైల్ ఫొటో)
2/ 10
జూలైలో మరో సారి సమీక్ష నిర్వహించి పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నట్లు సర్కార్ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
అయితే.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
పరీక్షలను కరోనా నేపథ్యంలో ఇప్పుడు వాయిదా వేసినా.. పరిస్థితి అనుకూలించిన అనంతరం తప్పనిసరిగా నిర్వహిస్తామన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
విద్యార్థుల భవిష్యత్ కోసం పదో తరగతితో పాటు ఇంటర్ పరీక్షలను కూడా తప్పనిసరిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కూడా తమతో సంప్రదింపులు నిర్వహిస్తోందన్నారు ఆదిమూలపు సురేష్.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించే మార్కులు రేపటి వారి భవిష్యత్ కు కీలకం అని మంత్రి వాఖ్యానించారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
జేఈఈ, నీట్ తదితర జాతీయ స్థాయి పరీక్షలతో పాటు రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు కూడా ఈ మార్కులు ముఖ్యమన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
ప్రతిపక్షాలు రాజకీయాలు మాని విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచించాలని మంత్రి హితవు పలికారు.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
ఇదిలా ఉంటే.. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.