దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. నిత్యం లక్షల్లో కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అప్రమత్తమైన పలు రాష్ట్రాలు విద్యసంస్థలకు సెలవులు ప్రకటించాయి. తెలంగాణలోను సీఎం కేసీఆర్ సర్కార్ ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటించింది. కానీ.. ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం పాఠశాలలను సెలవులను పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో..
సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించింది. అయితే, ప్రభుత్వ తీరుపై కొందరు పేరెంట్స్, ప్రతిపక్షాల నాయకులు మాత్రం ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఓ వైపు దేశంలో లక్షల సంఖ్యలో, రాష్ట్రంలో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం విద్యాసంస్థలను తెరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కేసులు ఉన్న స్కూళ్ల వరకే మూసివేస్తామని మంత్రి చెప్పారు. మిగతా స్కూళ్లన్నింటినీ యథావిధిగా నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అయితే, మంత్రి ప్రకటనతో ఏపీలో స్కూళ్లను మూసివేస్తారన్న ప్రచారానికి తెరపడిందని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విద్యాసంవత్సరం వృథా కావొద్దని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.