ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ మళ్లీ వాయిదా పడనున్నాయి. అయితే.. కొన్ని ఎగ్జామ్స్ వాయిదా పడతాయా? లేక అన్ని ఎగ్జామ్స్ వాయిదా పడతాయా? అన్న విషయంపై బోర్డు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. నిన్న మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జేఈఈ మెయిన్ ఎగ్జామ్ కు సంబంధించిన తేదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. కేవలం ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను షెడ్యూల్ ప్రకారమే కొనసాగించి, కేవలం సెకండియర్ ఎగ్జామ్స్ ను వాయిదా వేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సైతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే.. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా పడితే ఆ ప్రభావం టెన్త్ ఎగ్జామ్స్ పై సైతం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో ఈ రోజు ఎస్ఎస్ఈ బోర్డు, ఇంటర్ బోర్డ్ అధికారులు ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం పరీక్షల వాయిదాపై అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ అన్నీ వాయిదా పడితే.. మే 2న ప్రారంభం కానున్న టెన్త్ ఎగ్జామ్స్ తేదీలు కూడా మారే అవకాశం ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)