ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల సమయాలపై విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 8
రాష్ట్రంలోని హైస్కూళ్లు ఉదయం 9గంటల నుంచి 4గంటల వరకు కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 8
ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 8
హైస్కూళ్లలో ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు స్టూడెంట్స్ కి సెల్ఫ్ లెర్నింగ్, సూపర్వైజరీ స్టడీ క్లాస్, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గేమ్స్, స్పోర్ట్స్ ఉంటాయని తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 8
వీటికి ఆయా స్కూళ్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు, ఎస్ఏ (పీడీ)లు తప్పని సరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ క్లాసులకు ఇతర టీచర్లకు ఆప్షనల్ హాజరుమాత్రమే ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 8
ఇలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు హాజరు మినహాయింపు కల్పించారు. కానీ విద్యార్థులు మాత్రం అన్ని క్లాసులకు హాజరుకావాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 8
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2021-21 విద్యాసంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మకచిత్రం)
8/ 8
అందులో క్లాసుల వారీగా ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు స్కూళ్లు కొనసాగుతాయని పేర్కొంది. (ప్రతీకాత్మకచిత్రం)