ఏపీలో స్కూళ్ల ప్రారంభం, ఇంటర్ విద్యార్థులకు మార్కులపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.(సీఎం జగన్ - ఫైల్ ఫొటో)
2/ 7
ఈ రోజు విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్కూళ్ల ప్రారంభం, ఆన్లైన్ తరగతులు, ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు, నాడు-నేడు పనులపై చర్చించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈ సందర్భంగా ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేష్ సీఎం సమీక్షకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ నెల అంటే జులై 12 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంకా స్కూళ్లు ప్రారంభించే నాటికి అంటే ఆగస్టులోపు నాడు-నేడు పనులను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి వివరించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై సైతం సీఎం నిర్ణయిం తీసుకుకున్నట్లు మంత్రి వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
పదో తరగతి మార్కులకు 30 శాతం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు 70 శాతం మార్కులను కేటాయించి ఇంటర్ విద్యార్థులకు ఫలితాలను విడుదల చేస్తామన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఈ నెల 31 లోపు ఇంటర్ విద్యార్థులకు మెమోలు సైతం జారీ చేస్తామని మంత్రి వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)