కరోనా కారణంగా ఏర్పడిన తప్పనిసరి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అయితే ఫలితాలను ఏ ప్రతిపదికన విడుదల చేస్తారోనన్న అంశంపై కొన్ని రోజులుగా విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈ రోజు విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
సెకండియర్ విద్యార్థులు పదో తరగతిలో సాధించిన మార్కులకు 30 శాతం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో సాధించిన మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి మార్కులను విడుదల చేయనున్నారు అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఇంటర్ ప్రాక్టికల్ సబ్జెక్టులకు 100 శాతం మార్కులు, ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను కేటాయించే అవకాశం ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అయితే.. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో విద్యాశాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఇదిలా ఉంటే ఈ నెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలను సైతం జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.(ఆదిమూలపు సురేష్ - ఫైల్ ఫొటో)