ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ విభాగంలోని ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. తాజాగా శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో పలు ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. శ్రీకాకులం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఖాళీలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఫిజికల్ డైరెక్టర్, బయోమెడికల్ ఇంజినీర్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్లు, అసిస్టెంట్ ఎలక్ట్రికల్/వైర్ మెన్, ల్యాబ్ అటెండర్లు తదితర విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఫిజికల్ డైరెక్టర్ విభాగంలో ఒక ఖాళీ, బయో మెడికల్ ఇంజనీర్ విభాగంలో మరో ఖాళీ, ల్యాబ్ టెక్నీషియన్-5, డేటా ఎంట్రీ ఆపరేటర్-04, అటెండర్లు-05, అసిస్టెంట్ ఎలక్ట్రికల్/వైర్ మెన్-01, ల్యాబ్ అసిస్టెంట్ 02 ఖాళీలు ఉన్నాయి.(ఫొటో: https://srikakulam.ap.gov.in/)
అభ్యర్థులు మొదటగా https://cdn.s3waas.gov.in/s3f899139df5e1059396431415e770c6dd/uploads/2021/12/2021120114.pdf ఈ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ను పూర్తిగా నింపి office of the Principal, Government Medical College, Srikakulam చిరునామాలో ఈ నెల 15లోగా అందించాలి.(ప్రతీకాత్మక చిత్రం)
దరఖాస్తు ఫారం కు టెన్త్ సర్టిఫికేట్, ఇతర విద్యార్హతల సర్టిఫికేట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు, 4 నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్ల కాపీలను జత చేయాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు ఈ లింక్ https://cdn.s3waas.gov.in/s3f899139df5e1059396431415e770c6dd/uploads/2021/12/2021120158.pdf ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు.(ఫొటో: https://srikakulam.ap.gov.in/)