ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4775 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల- ఏప్రిల్ 6. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 7న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 18ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. మెరిట్ లిస్ట్ ను ఏప్రిల్ 20న ప్రచురించనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు ఏప్రిల్ 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా.. ఫైనల్ మెరిట్ లిస్ట్ & ఎంపికైన అభ్యర్థుల వివరాల ప్రకటన ఏప్రిల్ 25న ఉంటుంది. అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాల స్వీకరణ ఏర్పిల్ 26న ఉంటుంది. ఇంకా తుది ఎంపిక వివరాల ప్రకటన ఏప్రిల్ 27న ఉంటుంది. ఇంకా ఎంపికైన వారికి కౌన్సెలింగ్ ఏప్రిల్ 28 నుంచి 30 వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. (ఫొటో: http://hmfw.ap.gov.in/)