ANDHRA PRADESH APPLICATIONS INVITED FOR VOLUNTEER JOBS IN VIJAYANAGARAM DISTRICT HERE FULL DETAILS NS
AP Volunteer Jobs: ఏపీలోని ఆ జిల్లాలో వాలంటీర్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి వాలంటీర్ ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖాళీలు, దరఖాస్తుకు ఆఖరి తేదీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వరుసగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా 187 వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
విజయనగరం జిల్లాలో ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ కు ఈ నెల 30ని అధికారులు ఆఖరి తేదీగా నిర్ణయించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని సూచించారు. టెన్త్ లేదా ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ వాలంటీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అభ్యర్థులు తప్పనిసరిగా ఆయా గ్రామ లేదా వర్డు పరిధిలో నివసిస్తూ ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఉంటాయి. ఇతర సేవా సంస్థల్లో పని చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
అధికారిక వెబ్ సైట్: https://gswsvolunteer.apcfss.in/