APSSDC Jobs: హిందూపూర్ లోని Wipro Infrastructure Engineering(CP & CRP)లో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్ లోని Wipro Infrastructure Engineering(CP & CRP)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
డిప్లొమో/B.Tech-Mech చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి. 2018, 19, 20, 21 సంవత్సరాల్లో పాసై ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
ఎంపికైన వారికి నెలకు రూ. 13 వేల వేతనంతో పాటు ఉచిత రవాణ, సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 20న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన వారికి 28 రోజుల పాటు ట్రైనింగ్ అందిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
అభ్యర్థులు ఇతర ఏదైనా సందేహాలుంటే 7013425587, 9398643930 నంబర్లను సంప్రదించాలని నోటిఫికేషన్లో సూచించారు. ఎంపికైన అభ్యర్థులు హిందూపుర్ లోని Wipro Infrastructure Engineering(CP & CRP) పని చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)