AP Anganwadi Jobs 2020: ఏపీలో 855 ఉద్యోగాలు... దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేయండి
AP Anganwadi Jobs 2020: ఏపీలో 855 ఉద్యోగాలు... దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేయండి
AP Anganwadi Jobs 2020 | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. అనంతపురం జిల్లాలో మొత్తం 855 పోస్టుల్ని భర్తీ చేస్తోంది మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ. అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
2. మొత్తం 855 ఖాళీలు ఉండగా అందులో అంగన్వాడీ వర్కర్- 132, మినీ అంగన్వాడీ వర్కర్- 67, అంగన్వాడీ హెల్పర్- 656 పోస్టులున్నాయి. (Source: Official Notification)
3/ 11
3. మండలాల వారీగా అంగన్వాడీ వర్కర్ పోస్టుల వివరాలు ఇవే. (Source: Official Notification)
4/ 11
4. మండలాల వారీగా మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టుల వివరాలు ఇవే. (Source: Official Notification)
5/ 11
5. మండలాల వారీగా అంగన్వాడీ హెల్పర్ పోస్టుల వివరాలు ఇవే. (Source: Official Notification)
6/ 11
6. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 19 చివరి తేదీ. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
7. విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు 10వ తరగతి పాస్ కావాలి. 2020 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
8. స్థానికులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామస్తులై ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 11
9. వేతనాల వివరాలు చూస్తే అంగన్వాడీ వర్కర్‌కు రూ.11,500, మినీ అంగన్వాడీ వర్కర్‌కు రూ.7,000, అంగన్వాడీ హెల్పర్‌కు రూ.7,000 లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 11
10. దరఖాస్తు ఫామ్ https://ananthapuramu.ap.gov.in/ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి మెయిల్ ద్వారా పంపాలి. వేర్వేరు మండలాలకు వేర్వేరు మెయిల్ ఐడీలు ఉన్నాయి. మెయిల్ ఐడీల వివరాలను నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 11
11. అనంతపురం జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వివరాలను https://ananthapuramu.ap.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)