ANDHRA PRADESH ANGANWADI RECRUITMENT 2020 APPLICATION DEADLINE ENDS TODAY FOR 183 ANGANWADI POSTS IN WEST GODAVARI DISTRICT KNOW NOTIFICATION DETAILS SS
AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాల దరఖాస్తుకు ఈరోజే చివరి తేదీ
Andhra Pradesh Anganwadi Recruitment 2020 | ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలౌతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేయడానికి ఈరోజే చివరి తేదీ. ఖాళీల వివరాలు తెలుసుకోండి.
1. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 183 అంగన్వాడీ పోస్టులున్నాయి. వీటిలో అంగన్వాడీ వర్కర్-19, మినీ అంగన్వాడీ వర్కర్-4, అంగన్వాడీ హెల్పర్-160 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. కనీసం 10వ తరగతి పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏఏ అంగన్వాడీల్లో పోస్టులు ఖాళీ ఉన్నాయన్న వివరాలు http://www.westgodavari.org/ వెబ్సైట్లో Recruitment సెక్షన్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 11న ప్రారంభమైంది. అక్టోబర్ 20 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ కావాలి. వయస్సు 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. పెళ్లైన మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. స్థానిక గ్రామపంచాయతీలోనే నివసిస్తూ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)