ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలో పదో తరగతి చదువులున్న అన్ని బోర్డుల విద్యార్థులు (CBSE, ICSE, IB, State) తెలుగును తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సిందేనన్న నిబంధనను విధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కీలక ఆదేశాలను జారీ చేసింది విద్యాశాఖ. టెన్త్ లో తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ గా అమలుకు వీలుగా జీవో 15ను జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ జీవోను అమలు చేయాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులను ఆదేశించింది విద్యాశాఖ. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంలో విఫలమైన స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది విద్యాశాఖ. ఇదిలా ఉంటే.. సాధారణంగా టెన్త్ విద్యార్థులకు సంబంధిత బోర్డులే ఫైనల్ ఎగ్జామ్స్ ను నిర్వహిస్తూ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కానీ తెలుగు ఎగ్జామ్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ను ఆయా బోర్డులు రూపొందిస్తాయా? లేక ఎస్సీఈఆర్టీ రూపొందిస్తుందా? అన్నది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు కారణం.. ఆయా బోర్డుల్లో ప్రశ్నాపత్రాలు రూపొందించేందుకు తెలుగు నిపుణులు లేకపోవడం. ఈ నేపథ్యంలో NCERT తెలుగుకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)