1. తెలంగాణ ప్రభుత్వం 80,039 పోస్టుల్ని భర్తీ చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 మే 31 లోగా అప్లై చేయాల్సి ఉంటుంది. డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. (ప్రతీకాత్మక చిత్రం)
2. మరోవైపు 16,027 కానిస్టేబుల్ పోస్టులకు, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు, 587 ఎస్ఐ పోస్టులకు, పోలీసు రవాణా శాఖలో 63 పోస్టులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లికేషన్ ప్రాసెస్ త్వరలో ముగియనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) కోసం దరఖాస్తుల్ని స్వీకరించింది ప్రభుత్వం. 2022 జూన్ 12న టెట్ నిర్వహించనుంది ప్రభుత్వం. టెట్ ఫలితాలు విడుదలైన తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక మిగతా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు నిరుద్యోగులు. రావాల్సిన నోటిఫికేషన్స్లో 9,168 పోస్టులతో గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా ఉంది. గ్రూప్స్ నోటిఫికేషన్స్లో ఎక్కువ ఖాళీలు ఉన్న నోటిఫికేషన్ ఇదే. దీంతో నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ నెలాఖరులోనే టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఖాళీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ లాంటి పోస్టులు ఉంటాయి కాబట్టి పోటీ ఎక్కువగానే ఉంటుంది. సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 4 పోస్టులకు అప్లై చేస్తారని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
6. గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా ఖాళీలు భర్తీ చేసేందుకు ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు వివరాలు వచ్చాయి. ఆర్థిక శాఖ ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతి కూడా ఇచ్చింది. ఇంకా కొన్ని శాఖల నుంచి వివరాలు రావాల్సి ఉంది. ఆర్థిక శాఖ వాటికి కూడా ఆమోదం తెలిపితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇప్పటికే గ్రూప్ 1, ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నిరుద్యోగులు అన్ని నోటిఫికేషన్లకు అప్లై చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. కాబట్టి అభ్యర్థులకు పరీక్షలకు ప్రిపేర్ కావడానికి మూడు నాలుగు నెలల సమయం వచ్చేలా పరీక్షల్ని నిర్వహించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)