1. భారతీయ రైల్వేలో ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. రైల్వే జాబ్ నోటిఫికేషన్ (Railway Job Notification) ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులు ఎదురుచూస్తూ ఉంటారు. భారతీయ రైల్వే గత ఆరేళ్లలో 16 రైల్వే జోన్లలో 72,000 గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్టుల్ని తొలగించినట్టు వార్తలొస్తున్నాయి. ఇందులో ప్యూన్, వెయిటర్స్, గార్డెనర్స్, స్వీపర్స్, ప్రైమరీ స్కూల్ టీచర్స్ లంటి పోస్టులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. భారతీయ రైల్వే 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ మధ్య 16 రైల్వే జోన్లు 56,888 పోస్టుల్ని తొలగించాయి. నార్తర్న్ రైల్వే 9,000 పోస్టులు, సదరన్ రైల్వేస్ 7,524 పోస్టుల్ని తొలగించాయి. అధికారిక సమాచారం ప్రకారం 16 రైల్వే జోన్లు 81,000 పోస్టుల్ని ప్రతిపాదిస్తే అందులో 56,888 పోస్టుల్ని తొలగించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక త్వరలో భారతీయ రైల్వే మరో 15,495 పోస్టుల్ని తొలగించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త టెక్నాలజీ యుగంలో ఈ గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులు నిరుపయోగంగా మారడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఈ పోస్టులను భర్తీ చేయకూడదని రైల్వే నిర్ణయించింది. అయితే, ఇప్పటికే ఈ పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను భారతీయ రైల్వేలోని ఇతర విభాగాల్లో చేర్చుకోవాలని ఇండియన్ రైల్వేస్ భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ పోస్టులను సరెండర్ చేయడానికి ముందు, రైల్వే జోన్ల వారీగా తమ ఉద్యోగుల వర్క్ స్టడీ పనితీరును నిర్వహించింది. అధికారుల సమాచారం ప్రకారం ఈ పోస్టులు నిరుపయోగంగా ఉన్నాయని తేలింది. అందుకే వాటిని తొలగించాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పోస్టుల రద్దు ద్వారా ఎంత పొదుపు ఉంటుందనే దానిపై రైల్వే ఓ అంచనా కూడా ఇచ్చింది. అయితే సపోర్టింగ్ స్టాఫ్‌గా ఉంటూ నిరుపయోగంగా ఉన్న పోస్టుల్ని తొలగించి రైల్వే అభివృద్ధికి దోహదపడే టెక్నికల్ పోస్టుల్ని భర్తీ చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఉపాధి కల్పన విషయానికి వస్తే లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తూ దేశంలోనే అతిపెద్ద ఉపాధి కల్పన సంస్థగా భారతీయ రైల్వే కొనసాగుతోంది. అయితే ఔట్సోర్సింగ్ కారణంగా మంజూరైన పోస్టుల సంఖ్య భారీగా తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. సిబ్బంది వేతనాలు, పెన్షన్ కారణంగా వ్యయం పెరుగుతుండటంతో రైల్వేలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం రైల్వే ఈ చర్యలు తీసుకుంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. భారతీయ రైల్వేలో గెజిటెడ్ పోస్టులు, నాన్ గెజిటెడ్ పోస్టులు ఉంటాయి. గెజిటెడ్ పోస్టులు గ్రూప్ ఏ, గ్రూప్ బీ కేటగిరీ పోస్టులు ఉంటాయి. ఇక నాన్ గెజిటెడ్ పోస్టుల్లో గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్టులు ఉంటాయి. గ్రూప్ సీలో స్టేషన్ మాస్టర్స్, క్లర్స్క్, టికెట్ కలెక్టర్ పోస్టులు ఉంటాయి. వీటిలో కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు ఉంటాయి. ఇక గ్రూప్ డీ విషయానికి వస్తే ప్యూన్, సఫాయివాలా, హెల్పర్ పోస్టులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)