ALERT FOR JOB ASPIRANTS IN RAILWAYS SOUTH CENTRAL RAILWAY WARNS ABOUT JOB FRAUDS SS
Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం... 12 మందికి నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్
Railway Jobs | రైల్వేలో ఉద్యోగం మీ కలా? రైల్వే జాబ్ కోరుకుంటున్నారా? అయితే అలర్ట్. రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసాలు జరుగుతున్నాయని అభ్యర్థులను హెచ్చరిస్తోంది దక్షిణ మధ్య రైల్వే.
1. భారతీయ రైల్వే... దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. రైల్వేలో ఉద్యోగం నిరుద్యోగుల కల. రైల్వేలో జాబ్ సంపాదించాలని చాలా కష్టపడుతూ ఉంటారు. రైల్వేలో ఉద్యోగాలకు ఉన్న డిమాండే మోసగాళ్లకు వరం అవుతోంది. రైల్వేలో జాబ్స్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
2. రైల్వేలో జాబ్స్ పేరుతో మోసాలు బయటపడ్డ ప్రతీసారీ భారతీయ రైల్వేతో పాటు రైల్వే జోన్లు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్లీ అలాంటి మరో మోసం బయటపడింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
3. గుంతకల్లు డివిజన్లో సీనియర్ క్లర్క్ ఉద్యోగాల పేరుతో మోసం జరిగింది. 12 మంది అభ్యర్థులకు నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చేశారు మోసగాళ్లు. గుంతకల్లు డివిజన్ పర్సనల్ డిపార్ట్మెంట్ పేరుతో ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
4. ఈ అపాయింట్మెంట్ లెటర్‌తో ఓ అభ్యర్థి నేరుగా రైల్వే ఆఫీసుకి వెళ్లారు. తనకు రైల్వే జాబ్ వచ్చిందనుకుంటే అక్కడ నిరాశ ఎదురైంది. అది నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ అని తేలింది. గుంతకల్ డివిజన్ రైల్వే అధికారులు ఎవరూ ఆ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదని తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
5. ఆరా తీస్తే అది మోసం అని తేలింది. ఇలా రైల్వేలోని పలు కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగాళ్లు అమాయకులను వలలో వేసుకొని భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు చెల్లించిన అభ్యర్థులు దారుణంగా మోసపోతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
6. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB లేదా రైల్వే రిక్రూట్మెంట్ సెల్-RRC మాత్రమే జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. పరీక్షలు నిర్వహించి, క్వాలిఫై అయినవారిని మాత్రమే రైల్వేలో నియమిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
7. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు చెప్పారంటే అది మోసం అన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అలాంటి నేరగాళ్లను ఆశ్రయించొద్దంటూ దక్షిణ మధ్య రైల్వే హెచ్చరికలు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
8. అభ్యర్థులు రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కోసం ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ, రైల్వే అధికారిక వెబ్సైట్లు మాత్రమే ఫాలో కావాలి. ఈ వెబ్సైట్లలోనే రైల్వేలో జాబ్స్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్లు విడుదలౌతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
9. రైల్వేలో ఉద్యోగాలు పొందడానికి వివిధ దశల్లో పరీక్షలు క్వాలిఫై కావడం తప్ప మరో మార్గం లేదు. దళారులను ఆశ్రయించి మోసపోకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)