1. కరోనా వైరస్ పరిస్థితుల వల్ల సవాళ్లు ఎదురవడంతో తమకు రావాల్సిన అలవెన్సులను క్లెయిమ్ చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గడువు ముగిసే సమయంలోగా పత్రాలు సమర్పించేందుకు సాధ్యపడడం లేదు. దీంతో అలవెన్సులు, బెనిఫిట్లను కోల్పోతామని కొందరు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. నిర్ణయించిన గడువు పూర్తయిన తర్వాత వచ్చిన క్లెయిమ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆ శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ డిపార్ట్మెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. “కరోనా వల్ల ఏర్పడిన క్లిష్టపరిస్థితుల నేపథ్యంలో క్లెయిమ్‌లు/బిల్లుల బిల్లుల సెటిల్మెంట్ గడువును మే 31 నుంచి పొడిగించాలి. ఈ తేదీ తర్వాత చేసిన క్లెయిమ్‌లను కూడా సెటిల్ చేసేలా మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్లు పరిగణనలోకి తీసుకోవాలి” అని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఒకే నగరాన్ని సందర్శించినా ఆల్ఇండియా విజిట్‌గా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎల్టీసీ క్యాష్ వౌచర్ స్కీమ్‌ను కూడా కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ కింద వస్తువులను కొన్నప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు పన్ను మినహాయింపును కూడా పొందే అవకాశాన్ని కల్పించింది. (ప్రతీకాత్మక చిత్రం)