1. ఆర్మీలో ఉద్యోగాలు కోరుకునేవారి గుడ్ న్యూస్. తెలంగాణలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ (Army Recruitment Rally) నిర్వహించబోతోంది భారతీయ ఆర్మీ. సికింద్రాబాద్‌లో యూనిట్ హెడ్‌క్వార్టర్స్ కోటాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించబోతున్నట్టు కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. ఈ ర్యాలీ ద్వారా సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్ (ఏఈ), సోల్జర్ ట్రెడ్స్మ్యాన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియన్ ఆర్మీ. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక సోల్జర్ టెక్నికల్ (ఏఈ) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ తప్పనిసరి. ప్రతీ సబ్జెక్ట్‌లో కనీసం 40 శాతం మార్కులు ఉండాలి. మొత్తంగా 50 శాతం మార్కులతో పాస్ కావాలి. వయస్సు 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. సోల్జర్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు టెన్త్ క్లాస్ 33 శాతం మార్కులతో పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 17.5 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక సోల్జర్ Clk/SKT (ఏఓసీ వార్డ్) కేటగిరీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా సబ్జెక్ట్‌లో 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. మొత్తంగా 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇంగ్లీష్, మ్యాథ్స్, అకౌంట్స్, బుక్ కీపింగ్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 17.5 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. క్రీడార్హతల వివరాలు చూస్తే బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ, క్రికెట్ లాంటి క్రీడల్లో రాణించినవారు ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్ ఓపెన్ కేటగిరీలో దరఖాస్తు చేయొచ్చు. రాష్ట్రం తరఫున లేదా దేశం తరఫున జాతీయ, అంతర్జాతీయ కాంపిటీషన్స్‌లో, సీనియర్, జూనియర్ లెవెల్లో పాల్గొని ఉండాలి. సర్టిఫికెట్ రెండేళ్ల కన్నా పాతదై ఉండకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇండియన్ ఆర్మీ సూచించిన తేదీల్లో అభ్యర్థులు నేరుగా ర్యాలీకి వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ తిరుమలగిరి, ఈస్ట్ మారేడ్‌పల్లిలో హెడ్‌క్వార్టర్స్ ఏఓసీ సెంటర్లో రిపోర్ట్ చేయాలి. ఈ ర్యాలీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం airawat0804@nic.in లేదా www.joinindianarmy@nic.in మెయిల్ ఐడీల్లో సంప్రదించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. నవంబర్ 29 నుంచి జనవరి 30 వరకు రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుందని కేంద్ర రక్షణ శాఖ ప్రకటించినా కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితులను బట్టి ర్యాలీ తేదీల్లో మార్పులు ఉండొచ్చు. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కమాండెంట్ ఏఓసీ సెంటర్ ఈ ర్యాలీని రద్దు చేస్తూ నిర్ణయం కూడా తీసుకోవచ్చని తెలిపింది. కాబట్టి అభ్యర్థులు ర్యాలీకి వెళ్లే ముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)