అపోహ: అగ్నిపథ్ వల్ల యువతకు అవకాశాలు తగ్గుతాయి., వాస్తవం: నిజానికి నాలుగేళ్లపాటు దేశానికి సేవలందించే యువతీ యువకులకు సాయుధ దళాలలో పనిచేసే అవకాశాలు మెరుగుపడతాయి. కొన్నేళ్లలో సాయుధ దళాలలో ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ల కంటే అగ్నివీరుల రిక్రూట్మెంట్లు మూడు రెట్లు పెరుగుతాయి. (ఫొటో: ట్విట్టర్)
అపోహ: 21 ఏళ్ల యువతలో పరిపక్వత ఉండదు. వారిపై సైన్యం ఆధారపడటం అవివేకమే.
వాస్తవం,: ప్రపంచంలోని చాలా దేశాల సైన్యాలు తమ యువతపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఏ సమయంలో చూసుకున్న ఎక్స్పీరియన్స్ అఫీషియల్స్ కంటే ఎక్కువ మంది యువకులు ఉండరు. ప్రస్తుత పథకం చాలా నెమ్మదిగా సుదీర్ఘ కాలంలో యువకులు, ఎక్స్పీరియన్స్డ్ పర్యవేక్షక (Supervisory) ర్యాంక్‌ల అధికారులు 50%-50% ఉండేలా చేస్తుంది. (ఫొటో: ట్విట్టర్)
అపోహ:
అగ్నివీరులు సమాజానికి ప్రమాదకారులుగా మారతారు. ముఖ్యంగా వారు ఉగ్రవాదులతో చేతులు కలుపుతారు.
వాస్తవం:
ఇలా చెప్పడం భారత సాయుధ బలగాల ధర్మాన్ని, విలువలను అవమానించినట్లే అవుతుంది. నాలుగేళ్లుగా యూనిఫాం ధరించి భారత మాతకు సేవలందించిన యువకులు జీవితాంతం దేశం సమే పని చేస్తారు కానీ దేశానికి ద్రోహం చేయరు. (ఫొటో: ట్విట్టర్)