OpenAI ద్వారా ChatGPT AI చాట్‌బాట్ ప్రారంభించినప్పటి నుండి టెక్నాలజీ వరల్డ్ లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు దీని వల్ల కొన్ని రంగాల్లో పనిచేస్తున్నవారు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. Resumebuilder.com 1,000 మంది బిజినెస్ లీడర్స్ తో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో చాట్‌జిపిటిని అమలు చేసిన USలోని దాదాపు సగం కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను AIకి అవుట్సోర్స్ చేసినట్లు కనుగొన్నాయి. చాట్‌జిపిటి కారణంగా యుఎస్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారనే భయంతో ఉన్నారంట.
GPT-4 భర్తీ చేయగల 20 - డేటా ఎంట్రీ క్లర్క్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, ప్రూఫ్‌రీడర్, పారాలీగల్, బుక్‌కీపర్, ట్రాన్స్‌లేటర్, కాపీ రైటర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, సోషల్ మీడియా మేనేజర్, అపాయింట్మెంట్ షెడ్యూలర్, టెలిమార్కెటర్, వర్చువల్ అసిస్టెంట్, ట్రాన్స్క్రిప్షనిస్ట్, ట్రావెల్ ఎనలిస్ట్ , ట్యూటర్, టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ ఇమెయిల్ మార్కెటర్, కంటెంట్ మోడరేటర్ మరియు రిక్రూటర్.