ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సదరన్ రీజియన్ లోని వివిధ ఉద్యోగాల ఆన్ లైన్ నియామకం కోసం నోటిఫికేషన్ వెల్లడించింది. దీనిలో భాగంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్ఛేరి, లక్ష్యదీప్ లోని వివిధ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ఈ పోస్టులు ఆయా రాష్ట్రాల్లోని స్థిరనివాసం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. వీటిలో మొత్తం 156 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్)లో 132 పోస్టులు.. జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్)లో 10 పోస్టులు.. సీనియర్ అసిస్టెంట్ లో 13 పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) ఒక పోస్టు ఖాళీగా ఉంది.
అర్హత ప్రమాణాలు ఇలా.. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) ఉద్యోగాలకు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై 3 సంవత్సరాల ఆటోమొబైల్ లేదా మెకానికల్ డిప్లొమా లేదా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) ఉద్యోగాలకు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ (ఖాతాలు)ఉద్యోగాలకు 3 లేదా 6 నెలల కంప్యూటర్ సర్టిఫికేట్‌తో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
UR/OBC/EWS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1000 చెల్లించాలి. SC/ ST/ మహిళలు/ ఎక్స్-సర్వీస్‌మెన్/ PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు. వయోపరిమితి (25-08-2022 నాటికి) కనిష్ట వయో పరిమితి 18 సంవత్సరాలు, గరిష్ట వయో పరిమితి 30 సంవత్సరాలుగా పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) లకు నెలకు వేతనం రూ. 31,000-92,000 ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్)లకు నెలకు వేతనం రూ. 31,000-92,000, సీనియర్ అసిస్టెంట్ (ఖాతాలు) రూ. 36,000-1,10,000, సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) అభ్యర్థులకు నెలకు వేతనం రూ 36,000 నుంచి 1,10,000 మధ్య ఉంటుంది.పూర్తి వివరాలకు www.aai.aero వెబ్ సైట్ ను సందర్శించండి. (ప్రతీకాత్మక చిత్రం)