Anganwadi Jobs: మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
Anganwadi Jobs: మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
Anganwadi Jobs: ఆ జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో కింది అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్ వాడీ వర్కర్, అంగన్ వాడీ హెల్పర్, మినీ అంగన్ వాడీ వర్కర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్ వాడీ వర్కర్, అంగన్ వాడీ హెల్పర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని వైజాగ్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పోస్టులను నియమించనున్నారు. మొత్తం 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి మహిళలు మాత్రమే అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
అంతే కాకుండా.. దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థి స్థానికి గ్రామానికి చెందిన వివాహితులై ఉండాలి. విద్యార్హత విషయానికి వస్తే.. పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. జూలై 01, 2022 నాటికి అభ్యర్థి యొక్క వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
4/ 7
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయం (సీడీపీవో)లో నేరుగాగానీ లేదా పోస్టు ద్వారాగానీ అందజేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి అంగన్వాడీ వర్కర్ పోస్టులకు నెలకు రూ.11,500లు, మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులకు నెలకు రూ.7000, అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు నెలకు రూ.7000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
6/ 7
వీటితో పాటు.. కడప జిల్లాలో 71, విజయనగరం జిల్లాలో 78 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల ఆధారంగా టెన్త్, ఆ లోపు విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
కడపలో అంగన్ వాడీ వర్కర్ 18, అంగన్ వాడీ హెల్పర్ 49, అంగన్ వాడీ వర్కర్ 04 విభాగాల్లో ఉన్నాయి. విజయనగరం జిల్లాలో అంగన్ వాడీ వర్కర్ 10, అంగన్ వాడీ హెల్పర్ 50, అంగన్ వాడీ వర్కర్ 15 విభాగాల్లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)