బ్యాంక్ ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) వెల్లడించింది. UCO బ్యాంక్లో అనేక పోస్టుల కోసం కొత్త రిక్రూట్మెంట్(Recruitment) ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 20, 2022 నుంచి ప్రారంభం అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 అక్టోబర్ 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అంటే దరఖాస్తుల ప్రక్రియ అనేది రేపటితో ముగుస్తుంది. యూకో బ్యాంక్ సెక్యూరిటీ ఆఫీసర్స్ పోస్టుల కోసం ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.ucobank.com ని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)