ఇప్పటివరకు కేవలం విద్యాశాఖ కింద ఉన్న వర్సిటీల్లో నియామకాలను మాత్రమే కామన్ బోర్డు లేదా టీఎస్ పీఎస్ సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇక నుంచి అలా కాకుండా ఉమ్మడి టోర్డు ద్వారా నియామకాలు జరనున్నాయి. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అసెంబ్లీలో బిల్లును సమర్పించారు. (మంత్రి సబితారెడ్డి (ఫైల్ ఫొటో)
తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు కు సంబంధించి కొన్ని నెలల కిందట నుంచే నివేదికలు తయారు చేయడం, గణంకాలు సమర్పించడం వంటివి చేస్తూ వచ్చారు. గత నెలలో వర్సిటీల్లో పోస్టుల భర్తీ విధానం ఎలా ఉండాలో నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు అప్పగించారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో అన్ని వర్సిటీల్లో నియామకాలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మంత్రి అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టడంతో.. 15 యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి ‘తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు’ ద్వారానే జరగనున్నాయి.
వాటితో పాటు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండా లక్ష్మణ్ ఉద్యాన, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయంలోని బోధన, బోధనేతర ఖాళీలను కూడా ఈ బోర్డు ద్వారానే భర్తీ చేయనున్నారు. కొత్తగా నెలకొల్పబోయే మహిళా విశ్వవిద్యాలయం, ఫారెస్టు వర్సిటీల్లో నియామకాలను ఈ బోర్డుతోనే భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)