1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి డీఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, 65 లక్షల పెన్షనర్లకు పెన్షన్ పెరగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 17 శాతం డీఏ మాత్రమే వస్తోంది. 2020 జనవరి నుంచి డీఏ పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్న 11 శాతం డీఏ పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్రవేసింది. దీంతో ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 28 శాతం డీఏ రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. జూలై 1న డీఏ రీస్టోర్ అవుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భావించారు. కానీ డీఏ పెంపు వాయిదా పడింది. దీంతో ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2020 జనవరి డీఏ 4 శాతం, 2020 జూన్ డీఏ 3 శాతం, 2021 జనవరి డీఏ 4 శాతం పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 11 11 శాతం డీఏ రీస్టోర్ కావాల్సి ఉండగా ఆ మొత్తాన్ని పెంచింది కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. అయితే డీఏ 28 శాతానికి పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల నుంచే అమలు చేస్తుందా లేదా అన్న సంగతి తెలియాలి. దీంతో పాటు 2020 జనవరి నుంచి ఇప్పటివరకు ఉన్న డీఏ బకాయిల సంగతి ఏంటన్నది కూడా తెలియాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. ఇక 2021 జూలై డీఏ కూడా ప్రకటించాల్సి ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్-AICPI డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డీఏ ఎంత పెంచాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. AICPI డేటా 2021 మేలో రిలీజ్ అయింది. ఈ డేటా ప్రకారం 0.5 శాతం అంటే 120.6 పాయింట్స్ పెరిగినట్టు తెలుస్తోంది. 130 పాయింట్స్ ఉంటే 4 శాతం డీఏ పెరుగుతుంది. 120.6 పాయింట్స్ పెరగడంతో 2021 జూలై డీఏ 3 శాతం ఉండొచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగితే, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ కూడా పెరుగుతుంది. ఇక 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, 65 లక్షల పెన్షనర్లకు పెన్షన్లు పెరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)