1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం హోలీ పండుగ అడ్వాన్స్ ఇవ్వబోతోంది. స్పెషల్ ఫెస్టివల్ అడ్వన్స్ స్కీమ్ కింద హోలీ పండుగకు ముందుగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలోకి డబ్బులు రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. మార్చి 29న హోలీ పండుగ వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో హోలీ పండుగకు రెండు రోజులు సెలవులు ఉన్నాయి. మార్చి నెలాఖరులో హోలీ పండుగ రావడంతో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు తప్పవు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. పండుగ సమయంలో ఉద్యోగులు డబ్బుల కోసం ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం స్పెషల్ ఫెస్టివల్ అడ్వన్స్ స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్ కింద ఉద్యోగులకు రూ.10,000 అడ్వాన్స్ ఇవ్వనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. వాస్తవానికి 7వ పే కమిషన్ అమలైనప్పటి నుంచి ఫెస్టివల్ అడ్వన్స్ స్కీమ్ లేదు. 6వ పే కమిషన్‌లో ఫెస్టివల్ అడ్వన్స్ స్కీమ్‌లో భాగంగా రూ.4,500 వచ్చేది. కానీ ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫెస్టివల్ అడ్వన్స్ స్కీమ్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. స్పెషల్ ఫెస్టివల్ అడ్వన్స్ స్కీమ్ కింద ఎలాంటి వడ్డీ లేకుండా రూ.10,000 అడ్వాన్స్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. 2021 మార్చి 31 లోగా స్పెషల్ ఫెస్టివల్ అడ్వన్స్ రూ.10,000 తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. ఉద్యోగులందరికీ ప్రీపెయిడ్ రూపే కార్డ్ ద్వారా రూ.10,000 అడ్వాన్స్ లభిస్తుంది. అవసరం అనుకున్నవారు ఆ అడ్వాన్స్‌ను అకౌంట్ నుంచి డ్రా చేసుకొని వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. ఫెస్టివల్ అడ్వాన్స్‌ను ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. 10 వాయిదాల్లో చెల్లించొచ్చు. అంటే నెలకు రూ.1,000 చొప్పున చెల్లించొచ్చు. దీనికి ఎలాంటి వడ్డీ ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇటీవల మరో ఊరటనిచ్చింది కేంద్ర ప్రభుత్వం. పెండింగ్‌లో ఉన్న డియర్నెస్ అలవెన్స్-DA, డియర్నెస్ రిలీఫ్-DR జూలై నుంచి చెల్లించాలని నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)