7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... ఆ ఆర్డర్స్ వచ్చేశాయి
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... ఆ ఆర్డర్స్ వచ్చేశాయి
7th Pay Commission News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న కీలకమైన ఆర్డర్స్ వచ్చేశాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆర్డర్స్‌ని కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం డీఏ వస్తున్న సంగతి తెలిసిందే. 11 శాతం డీఏ పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2021 జూలై 1 నుంచి ఉద్యోగులకు 28 శాతం డీఏ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ఉద్యోగులకు 2020 జనవరి నుంచి డీఏ పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 2020 జనవరి డీఏ 4 శాతం, 2020 జూన్ డీఏ 3 శాతం, 2021 జనవరి డీఏ 4 శాతం చొప్పున మొత్తం 11 శాతం పెండింగ్‌లో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. పెండింగ్‌లో ఉన్న డీఏను కేంద్ర ప్రభుత్వం రీస్టోర్ చేయడంతో ఇక ఉద్యోగులకు 2021 జూలై 1 నుంచి 28 శాతం డీఏ వస్తుంది. ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు డీఏ పెంచుతూ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ వేతనం రూ.18,000 అనుకుంటే 17 శాతం డీఏ చొప్పున రూ.3,060 వచ్చేది. 28 శాతం డీఏ అమలులోకి వచ్చింది కాబట్టి డీఏ రూ.5,040 అందుకుంటారు ఉద్యోగులు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్‌తో పాటు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ కూడా అమలు చేయనుంది. 48 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకు పైగా పెన్షనర్లకు మేలు జరగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. మరోవైపు 2021 జూలై డీఏను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2021 జూలై డీఏ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు ఉద్యోగులు, పెన్షనర్లు. 2021 జూలై డీఏ 3 శాతం పెరగొచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)