3. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్-HBA విషయంలోనూ ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం. 2022 మార్చి 31 వరకు 7.9 శాతం వడ్డీ రేటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్-HBA తీసుకోవచ్చు. 2020 అక్టోబర్ 1 నుంచి హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్-HBA తీసుకున్నవారికీ ఇవే వడ్డీ రేట్లు వర్తిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక నవోదయ విద్యాలయ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌కు మెడికల్ క్లెయిమ్ రీఇంబర్స్మెంట్ సీలింగ్ పెరిగింది. ప్రస్తుతం ఉన్న మెడికల్ రీఇంబర్స్మెంట్ రూ.5,000 సీలింగ్‌ను రూ.25,000 చేసింది ప్రభుత్వం. అగైనెస్ట్ మెడికల్ అడ్వైస్ ట్రీట్మెంట్ సీలింగ్ రూ.5,000 నుంచి రూ.15,000 చేసింది ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానంలో కీలక మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. 7వ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ఫ్యామిలీ పెన్షన్ లిమిట్ భారీగా పెరిగింది. భార్యాభర్తలిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై, సిసిఎస్ (పెన్షన్) 1972 పరిధిలో ఉంటే.. వారి మరణానంతరం వారసులు రెండు పెన్షన్లను పొందే అవకాశం కల్పించింది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఇకపై రెండు పెన్షన్ల నుంచి వారసులు గరిష్టంగా ప్రతి నెలా రూ. 1.25 లక్షల వరకు పొందవచ్చు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 1972 లోని రూల్ 54, సబ్-రూల్ (11) ప్రకారం మరణించిన ఉద్యోగుల పిల్లలు లేదా తల్లిదండ్రులు రెండు పెన్షన్లను పొందేందుకు అర్హత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
9. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పనితీరును బట్టి ఏటా అందజేసే అప్రైజల్స్ కొరకు దరఖాస్తు గడువు పెంచింది మోదీ సర్కార్. 2021–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తవ్యాల్సి ఉండగా... కరోనా కారణంగా గడువు పొడిగించింది. దీనికి సంబంధించి కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
10. కేంద్ర ప్రభుత్వ గ్రూప్ A, B, C అధికారులకు వారి వార్షిక పనితీరును అంచనా వేసి ఏటా అప్రైజల్స్ లేదా ప్రోత్సాహకం అందజేస్తుంది ప్రభుత్వం. అయితే, ఈ ఏడాది కోవిడ్-19 కారణంగా తలెత్తిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో, అప్రైజల్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)