1. యూకేకు చెందిన 60కంపెనీలకు పైగా జూన్ నుంచి వారానికి 4రోజుల పాటు వర్క్ చేసే వెసలుబాటు కల్పిస్తున్నాయి. ప్రారంభంలో ఈ కొత్త వర్క్ కల్చర్‌పై 3వేల మంది ఉద్యోగులపై ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ట్రయల్స్‌లో ఉద్యోగులు ప్రొడక్టివిటీ, అట్రిషన్ రేట్, రిజిగ్నేషన్ తో పాటు ఇతర అంశాల్లో సత్ఫలితాలు రాబడితే శాస్వతంగా వర్కింగ్ డేస్‌ను కుదించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. పనిదినాల్ని కుదించడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారానికి 4రోజులు పనిచేయడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా.కుటుంబసభ్యులతో గడపడమే కాదు. హయ్యర్ స్టడీస్‌తో పాటు నేను నేర్చుకోవాలని.. టైమ్ లేక కంప్లీట్ చేయలేకపోయిన టెక్నాలజీ కోర్స్ల్ని పూర్తి చేస్తా'నని లూయిస్ అనే ఉద్యోగి తెలిపాడు. (ప్రతీకాత్మక చిత్రం)
5. కొన్ని నెలల క్రితం ప్యానాసోనిక్ కొత్త వర్క్ పాలసీని అమలు చేస్తోంది. అందులో భాగంగా ఫోర్ డే వర్క్ వీక్ అంటే వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే విధులు నిర్వహిస్తే చాలని ప్రకటించింది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు డ్యూటీ చేస్తే చాలు. ప్రస్తుతం చాలావరకు కంపెనీలు వారంలో ఐదు రోజులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల కొన్ని కంపెనీలు ఫోర్ డే వర్క్ వీక్ అమలు చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)