School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 03 నుంచి సెలవులు..
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 03 నుంచి సెలవులు..
School Holidays: ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 03 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ఆయా పాఠశాలలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 03 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ఆయా పాఠశాలలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. అంతే కాకుండా.. ఒంటి పూట బడులు కూడా అదే రోజు నుంచి ప్రారంభం అవుతాయిని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు జరిగే 3349 పాఠశాలల్లో రెండు పూటలు సెలవులు ఉంటాయని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
అంటే ఏప్రిల్ 03 నుంచి ఏప్రిల్ 18 వరకు ఈ సెలవులు ఉండనున్నాయి. ఈ ఏడాది 6 పేపర్ల విధానంలో పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఇప్పటికే తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు ఈ ఒంటిపూట బడులు ఆ రోజు నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ప్రకటించలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
2022లో ఏప్రిల్ 04 నుంచి ఒంటిపూటబడులు ప్రారంభం అయ్యాయి. ఈ సారి కూడా ఏప్రిల్ 04 నుంచి ప్రారంభం అవుతాయని భావించినా .. ఒక్కరోజు ముందుగానే ఈ ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న రోజు నుంచే ఏప్రిల్ 03 నుంచి ఈ ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. హాఫ్ డే స్కూల్స్ సమయంలో.. ఉదయం 7.30 నిమిషాల నుంచి 11.30 గంటల వరకు తరగతులు ఉండనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఇక సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్ 19 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఉండగా.. ఏప్రిల్ చివరి వారంలో మిగిలిన తరగతులకు ఉండనున్నాయి. అంటే ఏప్రిల్ 30 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు . (ప్రతీకాత్మక చిత్రం)