WHICH TEAM WON MOST IPL WINS IN ALL SEASONS FULL DETAILS HERE MS
IPL: ఐపీఎల్ కింగ్ ఎవరో తెలుసా..? అత్యధిక మ్యాచ్ లు గెలిచిన జట్టు ఇదే..
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా..అన్ని సీజన్లలో ఏ జట్టు ఎన్ని మ్యాచ్ లాడింది..? అందులో ఎన్ని గెలిచింది..? ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్ లన్నింటిలో కలిపి అత్యధిక మ్యాచ్ లు గెలిచింది ఎవరు..? ఈ వివరాలన్నీ మీకోసమే.
ఢిల్లీ క్యాపిటల్స్ : ఈ జట్టు ఐపీఎల్ లో 189 సార్లు ప్రత్యర్థి జట్లతో తలపడగా.. అందులో 84 మ్యాచ్ లు మాత్రమే గెలిచింది.
2/ 8
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అధీనంలోని ఈ జట్టు ప్రతీసారి ఐపీఎల్ టైటిల్ ఫేవరేట్లలో ఒకటి. కానీ ఇంతవరకు ఒక్క కప్పూ నెగ్గలేదు. కాగా, ఆర్సీబీ ఇప్పటిదాకా 194 మ్యాచ్ లు ఆడగా.. అందులో 91 మ్యాచ్ లు గెలిచింది.
3/ 8
కోల్ కతా నైట్ రైడర్స్ : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నేతృత్వంలోని కేకేఆర్.. 193 మ్యాచ్ లలో పాల్గొనగా.. అందులో 98 మ్యాచ్ లలో నెగ్గింది.
4/ 8
కింగ్స్ లెవెన్ పంజాబ్ : ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న జట్లలో ఇది ఒకటి.. కాగా, కింగ్స్ ఎలెవన్ ఇప్పటిదాకా 186 మ్యాచ్ లు ఆడి 87 విజయాలు అందుకుంది.
5/ 8
చెన్నై సూపర్ కింగ్స్ : తమిళ తంబిల అభిమానాన్ని గుండెలనిండా హత్తుకున్న సీఎస్కే.. 177 మ్యాచ్ లు ఆడి అందులో ఏకంగా 104 సార్లు విజయాలు సాధించింది.
6/ 8
ముంబై ఇండియన్స్ : ముఖేశ్ అంబానీ భార్య నీతూ అంబానీ ఓనర్ గా ఉన్న ముంబై ఇండియన్స్.. అందరికంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడింది. ఆ జట్టు 199 మ్యాచ్ లు ఆడగా.. అందులో ఏకంగా 116 సార్లు విజయాలు అందుకుంది.
7/ 8
సన్ రైజర్స్ హైదరాబాద్ : ఐపీఎల్ మొదటి సీజన్ (అప్పట్లో డక్కన్ ఛార్జెర్స్ పేరుతో ఉండేది) నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ 119 మ్యాచ్ లు ఆడగా.. అందులో 62 మ్యాచ్ లలో నెగ్గింది.
8/ 8
రాజస్థాన్ రాయల్స్ : ఈ జట్టు ఇప్పటివరకు 162 మ్యాచ్ లు ఆడగా.. అందులో 80 మ్యాచ్ లు గెలిచింది.