ఐపీఎల్లో పలువురు స్టార్లను కోట్లు కుమ్మరించి ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. వారు జట్టులో ఉంటే కొండంత బలమని ఊహించాయి. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ క్రికెటర్లు ఈ సీజన్లో అట్టర్ ఫ్లాపయ్యారు. హీరోలవుతారనుకుంటే.. జీరోలయ్యారు. మరి వారెవరో ఇక్కడ చూడండి.
మాక్స్వెల్ : పంజాబ్ టీమ్ రూ.10.75 కోట్లతో మాక్స్‌వెల్‌ను సొంతం చేసుకుంది. సిక్సర్ల మోత మోగించే అతడు.. ఈ సారి ఒక్క సిక్స్ కూడా ఆడలేదు. 13 మ్యాచ్‌ల్లో 15 సగటుతో 108 పరుగులు మాత్రమే చేశారు. బౌలింగ్‌లోనూ 3 వికెట్లే తీశాడు.(Image:IPL)
2/ 8
ఆండ్రే రసెల్‌ను 2018లో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు 117 పరుగులు మాత్రమే చేశాడు, ఆరు వికెట్లు తీశాడు
3/ 8
వెస్టిండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్‌ను పంజాబ్ రూ.8.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఎన్నో అంచనాలతో టోర్నీలోకి అడుగు పెట్టిన అతడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన కాట్రెల్.. కేవలం ఆరు వికెట్లు సాధించాడు.
4/ 8
వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షిమ్రోన్ హెట్‌మెయిర్‌ను ఢిల్లీ టీమ్ రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐతే అతడు 10 మ్యాచ్‌ల్లో 19 సగటుతో 138 పరుగులే చేశాడు.
5/ 8
కేదార్ జాదవ్‌ను 2018లో చెన్నై రూ.7.8 కోట్లతో దక్కించుకుంది. టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 62 పరుగులే చేశాడు. ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు.
6/ 8
సీనియర్ బౌలర్ పీయూష్ చావ్లా కోసం చెన్నై రూ. 6.75 కోట్లు వెచ్చించింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లే తీసి విఫలమయ్యాడు.
7/ 8
ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో కోసం చెన్నై ఫ్రాంచైజీ రూ.6.4 కోట్లు వెచ్చించింది. 6 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం ఏడు రన్స్ చేశాడు. ఆరు వికెట్లు పడగొట్టాడు.
8/ 8
ఆస్ట్రేలియా పేసర్ నాథన్ కౌల్టర్ నైల్‌ను వేలంలో ముంబై ఇండియన్స్ రూ.8 కోట్లకు దక్కించుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లే సాధించాడు.