IPL 2020: సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డు.. ప్లేఆఫ్స్‌లో కేక
IPL 2020: సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డు.. ప్లేఆఫ్స్‌లో కేక
IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం ముంబైని ఓడించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభంలో ఇబ్బందులు పడిన వార్నర్ సేన.. ఆఖరులో అనూహ్యంగా పుంజుకొని ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఐపీఎల్లో మరో రికార్డు సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ .
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత.. వరుసగా ఐదుసార్లు ప్లేఆఫ్స్ చేరుకున్న మూడో జట్టుగా హైదరాబాద్ అవతరించింది. 2016-20 మధ్య వరుసగా ప్లేఆఫ్స్ చేరుకుంది. (Image:IPL)
2/ 6
2010-15 వరకు ముంబయి ఆరు సార్లు వరుసగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అందులో నాలుగుసార్లు విజేతగా నిలిచింది. (Image:IPL)
3/ 6
2008-15 మధ్య చెన్నై వరుసగా ఎనిమిది సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోగా రెండుసార్లు టైటిల్ గెలిచింది. నిషేధం తర్వాత మరో ట్రోఫీ అందుకుంది. (Image:IPL)
4/ 6
2016 నుంచి వరుసగా ప్లే ఆఫ్స్‌కు వెళ్లున్న హైదరాబాద్ టీమ్.. 2016లో ఏకంగా టైటిల్ సాధించింది. 2017లో మూడో స్థానంలో నిలిచింది. 2018లో టైటిల్ పోరులో చెన్నై చేతిలో ఓడి రెండో స్థానంలో నిలిచింది. 2019లో నాలుగో స్థానంలో నిలిచింది. (Image:IPL)
5/ 6
ఆఖరి మూడు మ్యాచుల్లో టాపర్లుగా ఉన్న మూడు జట్లను ఓడించి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది హైదరాబాద్. మెరుగైన రన్ రేట్ ఉండడంతో ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది. (Image:IPL)
6/ 6
నవంబరు 6న అబుదాబిలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో తలపడునుంది హైదరాబాద్. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిస్తే క్వాలిఫైయర్-2 వెళ్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. (Image:IPL)