Low point: ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ పర్వాలేదనిపించింది. కీలక ఆటగాళ్ళు గాయం కారణంగా టోర్నికి దూరమైన తనకున్న వనరులతో రాణించింది. ఓటమిని చవిచూసిన కొన్ని మ్యాచ్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్ లోపాలను ఎత్తిచూపాయి. ముఖ్యంగా రాయల్స్ 5 వికెట్ల తేడాతో, సూపర్ కింగ్స్‌పై 20 పరుగుల తేడాతో, సూపర్ ఓవర్లో కెకెఆర్ చేతిలో ఓడిపోయింది. ఇవి టోర్నిలో ఎస్ఆర్హెచ్కు ఇబ్బందికలిగించే ఓటములు
చివరిలో ఫ్లేఆఫ్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మూడు మ్యాచ్‌లను గెలిచి తన సత్తా ఏంటో చూపించింది సన్‌రైజర్స్. తర్వాత క్వాలిఫైయర్ 2 చేరాడానికి ఎలిమినేటర్‌లో ఆర్సిబిని ఓడించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన విధానం గెలుపు కోసం అనుసరించిన మార్గం, పద్ధతి,వ్యూహం టోర్నమెంట్లో ఎస్ఆర్హెచ్ను బలమైన టీంగా నిలబెట్టాయి
Most valuable player: ఐపిఎల్ 2020లో SRHకు రషీద్ ఖాన్ ప్రధాన అయుధంగా నిలిచాడు. 16 మ్యాచ్‌లలో 20 వికెట్లతో 5.37ఎకానమీ రేటుతో జట్టులో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు - ఈ టోర్నమెంట్లో ఉత్తమమైన ప్రతిభ కనబరిచాడు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ఎస్ఆర్హెచ్కు కీలకంగా మారాడు.