Sunrisers: వచ్చే ఏడాది హైదరాబాద్ టీమ్ నుంచి ఈ ప్లేయర్స్ ఔట్..?
Sunrisers: వచ్చే ఏడాది హైదరాబాద్ టీమ్ నుంచి ఈ ప్లేయర్స్ ఔట్..?
వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశముంది. జట్టులో కొందరికి అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోవడం లేదు. మరికొందరినేమో తుది జట్టులోకి తీసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అలాంటి వారంతా డగౌట్‌కే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో ఈ ఐదుగురు క్రికెటర్లను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ వదులుకునే అవకాశముంది.
1. శ్రీవత్స్ గోస్వామి: 2008 నుంచి ఐపీఎల్లో ఉన్నప్పటికీ ఎవ్వరికీ పెద్దగా తెలియదు. రెగ్యులర్ వికెట్ కీపర్ ఐన ఇతడికి.. ఏ ఫ్రాంచైజీలో ఉన్నా తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. రిజర్వ్డ్ కీపర్‌గానే ఉంటున్నాడు. హైదరాబాద్ టీమ్‌లో సాహా, బెయిర్‌స్టో ఉండడంతో గోసామికి అవకాశాలు రావడం లేదు.
2/ 5
2. బాసిల్ థంపి ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు.
3/ 5
3. బిల్లి స్టాన్లేక్.. తుది జట్టులో నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లకు అవకాశముంది. ఐతే హైదరాబాద్ టీమ్‌లో వార్నర్, విలియమ్సన్, బెయిర్‌స్టో, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ సెటిల్ అయినందున.. ఇతడికి చోటు లభించడం లేదు. వేరే ఫ్రాంచైజీ కోసం ఎదురుచూస్తున్నాడు.
4/ 5
4. ఖలీల్ అహ్మద్. ఇతడు కూడా అంచనాలను అందుకోవడం లేదు. తన స్పెల్‌లో ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు. వచ్చే ఐపీఎల్ నాటికి ఖలీల్‌ను ఎస్ఆర్హెచ్ వదులుకునే అవకాశముంది.
5/ 5
5. బావనక సందీప్. ఈ హైదరాబాద్ ప్లేయర్‌ని SRH దక్కించుకున్నప్పటికీ జట్లులో ప్రియం గార్గ్, అభిషేక శర్మ నుంచి పోటీ ఉంది. ఈ క్రమంలోనే తుది జట్టులోకి రావడం లేదు. కొత్త ఆటగాళ్ల కోసం చూస్తున్న ఆర్సీబీ, సీఆఎస్కే, ఆర్ఆర్ టీమ్‌లు ఇతడిని దక్కించుకునే అవకాశముంది.