విదేశాల్లో రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అగ్గిపెట్టె లాంటి ఇళ్లు కోట్ల రూపాయలు పలుకుతాయి. ఇంటీరియర్ ఏమీ లేకపోయినా.. ఇష్టపడి కొనుక్కునే వాళ్లుంటారు. ఇది మరో రకమైన వార్త. స్పెయిన్ లోని సాల్టో డి కాస్ట్రో (Salto de Castro) గ్రామం అమ్మకానికి వచ్చింది. (image credit - twitter - @lamiak_02)
ఆ గ్రామంలో దాదాపు 44 ఇళ్లు ఉన్నాయి. చూడటానికి ఇళ్లే కాదు గ్రామం కూడా అందంగా ఉంటుంది. దాని ధర దాదాపు రూ.2 కోట్లుగా నిర్ణయించారు. ఇక్కడో లిటిగేషన్ ఉంది. ఆ గ్రామంలో 30 ఏళ్లుగా ఎవరూ ఉండట్లేదు. కాబట్టి.. ఆ ఇళ్లన్నీ పాతవే. అయినప్పటికీ.. కొనేందుకు వంద మందికి పైగా రెడీ అయ్యారు. (image credit - twitter - @lamiak_02)
స్పెయిన్ - పోర్చుగల్ మధ్యలో ఉంది ఆ గ్రామం. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి ఆ గ్రామానికి వెళ్లేందుకు 3 గంటలు పడుతుంది. గ్రామంలోని చాలా ఇళ్లు శిథిలావస్థలో ఉన్నా.. అందంగానే ఉన్నాయి. అక్కడ ఇళ్లతోపాటూ.. ఓ హోటల్, చర్చి, స్కూల్, మున్సిపల్ స్విమింగ్ పూల్, స్పోర్ట్స్ ఏరియా, ఓల్డ్ సివిల్ గార్డ్ బ్యారక్స్ ఉన్నాయి. (image credit - twitter - @lamiak_02)