China Corona : 2020, 21లో కరోనా సవాళ్లను ఎదుర్కొన్న ఇండియా.. 2022లో మాత్రం కాస్తంత ఊపిరి పీల్చుకుంది. ఇక ఇప్పుడు కొత్త సంవత్సరంలో మళ్లీ చైనా భయపెడుతోంది. కొత్త కేసులు ఎన్ని వస్తున్నాయి? ఏయే వేరియంట్లు జోరుగా ఉన్నాయి? మరణాలు ఎన్ని? ఇలా ఏ విషయాల్నీ బయటపెట్టట్లేదు. ఐతే.. తాజాగా కొత్త కేసులు, మరణాలు మరింతగా పెరుగుతున్నాయని అనధికారికంగా తెలుస్తోంది. (image credit - reuters)
కరోనాను ఎదుర్కొనే విషయంలో అసాధారణ ప్రయత్నాలు చేశామన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఐతే.. విషయాల్ని గోప్యంగా ఉంచడం ద్వారా ఆయన ప్రపంచ దేశాలను ప్రమాదంలో పడేస్తున్నట్లు కనిపిస్తోంది. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వివరాలు అడుగుతున్నా ఇవ్వకపోవడం వల్ల 2023లో కూడా ప్రపంచ దేశాలకు కరోనా ముప్పు ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. (image credit - reuters)
చైనాలో కొత్తగా వ్యాపిస్తున్న ఒమైక్రాన్ వేరియంట్ BF.7.. ఇప్పటివరకూ బీజింగ్ లాంటి నగరాలకే పరిమితమైంది. ఐతే.. చైనాలో ఇప్పుడు న్యూఇయర్ వేడుకల సమయం. కోట్ల మంది బీజింగ్ లాంటి నగరాల నుంచి పల్లెలకు వెళ్తారు. అందువల్ల కొత్త వేరింయంట్.. పల్లెలకు వ్యాపించగలదు. తద్వారా కరోనా వ్యాప్తి మరింత పెరగగలదు. (image credit - reuters)
కొత్త సంవత్సరం మొదలైందన్న మాటే గానీ.. ప్రపంచ దేశాలకు మనస్శాంతి లేదు. చైనా, హాంకాంగ్, మలేసియా, జపాన్, అమెరికా, స్పెయిన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్ లాంటి దేశాల నుంచి తమ దేశాలకు వచ్చేవారికి థెర్మల్ స్క్రీనింగ్స్, కరోనా టెస్టులు చేయిస్తున్నాయి దేశాలు. ఇండియా కూడా ఇలాంటివి చేయిస్తోంది. (image credit - reuters)
ఒక విషయంలో భారతీయులు ఊపిరి పీల్చుకోవచ్చు. ఏంటంటే.. చైనాలో వ్యాపిస్తున్న BF.7 వేరియంట్ ఇండియాలో సెప్టెంబర్ 2022లోనే బయటపడింది. అప్పటి నుంచి 3 నెలలు గడిచినా.. ఆ వేరియంట్ కేసులు 4 మాత్రమే ఇప్పటివరకూ నమోదయ్యాయి. నిజంగా అది ఇండియాలో జోరుగా ఉండి ఉంటే.. ఈపాటికే తీవ్రంగా ఉండేది. అంటే.. భారత్లో ఆ వేరియంట్ వల్ల అంతగా ప్రమాదం లేనట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండటం మంచిదే. (image credit - reuters)
ఇప్పటికైనా చైనా WHOకి సహకరించాలి. వాస్తవాల్ని ప్రపంచానికి చెప్పాలి. ఆ దిశగా ప్రపంచ దేశాలు చైనాపై ఒత్తిడి తేవాలి. వీలైనంత త్వరగా ఆ దేశంలో కరోనాను కంట్రోల్ చెయ్యాలి. లేదంటే.. ఆ దేశంలో కొత్తగా పుట్టే వేరియంట్లు మరింత వేగంగా వ్యాప్తి చెందగలవు. అవి వ్యాక్సిన్లను కూడా తట్టుకొనే స్థాయికి చేరగలవు. అప్పుడు ప్రపంచం ప్రమాదంలో పడుతుంది. ఇలా ప్రపంచ భవిష్యత్తు చైనా చేతుల్లో ఉన్నట్లవుతోంది. (image credit - reuters)